![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -351 లో... తనే రామలక్ష్మి అన్న నిజం బయటపెట్టాలని సీతాకాంత్ అనుకొని.. మీరు లండన్ లో ఎక్కడ ఉంటారు.. ఈ సారి లండన్ వచ్చినప్పుడు మీరే అంతా తిరిగి చూపించాలని అంటాడు. కావాలనే నన్ను టెస్ట్ చేస్తున్నారు కదా అసలు బయటపడననుకుంటుంది రామలక్ష్మి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు అని రామలక్ష్మి ఇవ్వగానే సీతాకాంత్ షాక్ అవుతాడు.
సీతాకాంత్ రాత్రి రామలక్ష్మి గురించి డైరీ రాస్తుంటాడు. ఎప్పుడు బాధగా డైరీ రాసే బావగారు ఇప్పుడేంటి ఇలా సంతోషంగా రాస్తున్నారని శ్రీవల్లి అనుకుటుంది. సీతాకాంత్ రామ్ ని పడుకోపెడుతుంటాడు. ఎప్పుడు రామలక్ష్మి అంటావ్ ఎవరామె అని రామ్ అడుగుతాడు. సరే చెప్తానంటూ రామలక్ష్మి గురించి చెప్తుంటే రామ్ పడుకుంటాడు. సీతాకాంత్ కూడా పడుకుంటాడు. సీతాకాంత్ రాసిన డైరీనీ శ్రీవల్లి తీసుకొని.. అందులో రామలక్ష్మి గురించి రాసింది చూసి షాక్ అవుతుంది. రామలక్ష్మి నిన్ను మళ్ళీ నా భార్యని చేసుకుంటానని అందులో రాసి ఉంటుంది. వెంటనే శ్రీలత, సందీప్ లకి శ్రీవల్లి చూపిస్తుంది. వాళ్ళు కూడా షాక్ అవుతారు. నేను అనుకున్నట్లే అవుతుందని శ్రీవల్లి అంటుంది.
మరొకవైపు రామలక్ష్మి, సుశీల, ఫణీంద్రలు మాట్లాడుకుంటారు. నేను ఇలాగే సీతా సర్ కళ్ల ముందు ఉంటే నా నుండి నిజం బయటపడేలా చెయ్యాలనుకుంటారు. నేను రేపటి నుండి సీతా సర్ కి దూరంగా ఉంటానని రామలక్ష్మి అంటుంది. మరుసటిరోజు సీతాకాంత్ రామ్ ని తీసుకొని రామలక్ష్మి ఇంటికి వస్తాడు. దాంతో ఎందుకిలా మాటిమాటికి వస్తున్నారు. మీ అబ్బాయికి చదువు వచ్చు.. యాక్టింగ్ చేస్తున్నాడు.. మీరే చెప్పండి చదువు మీ బాబుకి అని రామలక్ష్మి కోపంగా మాట్లాడుతుంది. దాంతో రామ్ నేనేం యాక్టింగ్ చెయ్యట్లేదని బాధగా వెళ్ళిపోతాడు. సీతాకాంత్ తన వెనకాలే వెళ్తాడు. తన మీద కోపం ఆ బాబుపై చూపించడం తప్పు అని ఫణీంద్ర, సుశీల ఇద్దరు రామలక్ష్మితో అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |